రైతు భరోసాను ప్రారంభించిన జగన్.. రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించాడన్న సీఎం

  • దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సాయాన్ని రైతులకు అందిస్తున్నాం
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చా
  • రైతులకు సాయం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా
'వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్' కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారని... రాష్ట్రమంతా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయని... రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించారని అన్నారు. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటికుండలుగా మారాయని తెలిపారు. దేశంలోనే ఒక గొప్ప పథకాన్ని ఈరోజు ప్రారంభించామని... ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత ఎక్కువ పెట్టుబడి సాయాన్ని ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తామని చెప్పారు. తన పాదయాత్రలో రైతుల ఆవేదనను చూశానని... రైతులకు సాయం చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు. 

Go Back to Shorts
Jagan
Raithu Bharosa
Andhra Pradesh

More Telugu News